సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) కార్యక్రమాన్ని శనివారం డీజీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ (పి& ఎల్) గజరావు భూపాల్ పోలీసు అధికారులు, సిబ్బందితో జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు.
మల్టీ జోన్-I ఐజీ చంద్రశేఖర్ రెడ్డి దేశ సమైక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం సంస్థానాల విలీనంలో కీలక పాత్ర పోషించి దేశ ఐక్యతకు బలమైన పునాది వేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐజీ (అడ్మిన్) అన్యోన్య, పలువురు పోలీసు అధికారులు, సీఏవోలు, ఏవోలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



.jpg?token=eyJraWQiOiI1MzI1MmMyZi02NDE1LTRkYWQtODU5MC04M2E4M2MyNmY3NTQiLCJhbGciOiJIUzUxMiJ9.eyJ1cmwiOiJicHUtbWVkaWEvU2Ftc3VuZ19HYWxheHlfUzZfZWRnZV8oMTc0NDgyNzg1MzkpLmpwZyIsInNjb3BlIjoiZG93bmxvYWQiLCJpYXQiOjE3OTQzMzk3OTksImV4cCI6MTc5NDM0MDM5OX0.1D1Da-ysqOwjcQQsL8qMiZNuERlAK5dV2xTj9QSvyqa4Fv1-m41_ec9EMQ50zTgSRrj5IUtNgnIeFv52u3vJLg)

